Homeజిల్లాలుతూర్పు గోదావరిఅంబటి ని రాష్ట్రం నుండి బహిష్కరించాలి

అంబటి ని రాష్ట్రం నుండి బహిష్కరించాలి

- Advertisement -

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్

విశాలాంధ్ర – మండపేట : సభ్య సమాజం తలదించుకునేలా దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ను ఈ రాష్ట్రం నుండి బహిష్కరించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండపేట టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం అతను ఎటువంటి మాటలు అన్నాడో చెప్పే పరిస్థితి కూడా లేదని, అంత దుర్మార్గపు వాఖ్యలు చేసిన అంబటి కి బుద్ధి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకెప్పుడూ ఇలాంటి నీచ వాఖ్యలు చేయకుండా చూడాలన్నారు. చంద్రబాబు పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. గతం లో ఏ తప్పూ చేయక పోయినా టీడీపీ నేత పట్టాభి పై వైసీపీ నేతలు దాడి చేయడం జరిగిందన్నారు. అయితే అప్పట్లో వారి అధినేత జగన్ పై టీడీపీ నేతలెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. చూస్తుంటే అంబటి కి మతిభ్రమించినట్టు అనిపిస్తుందన్నారు. చంద్రబాబు అభిమానులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తాలని చూస్తున్నారా అని వేగుళ్ళ ప్రశ్నించారు. గతంలో జగన్ భార్య పై తప్పుడు వాఖ్యలు చేసిన టీడీపీ అభిమానిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు అంతకంటే దారుణ వాఖ్యలు చెందిన అంబటి పై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అంబటిపై పోలీస్ లు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ళ డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు