నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ అనురాధ
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి విద్యార్థి చదువుకొనేటలో భాగంగా కన్ను కూడా అతి ముఖ్యమైన భాగమని, కంటి పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడే చక్కటి చదువు లభిస్తుందని నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలతో పాటు కంటి అద్దముల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అంతత్వ నివారణ అధికారి డాక్టర్ అనురాధ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 మంది విద్యార్థులకు నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, డాక్టర్ అనురాధ చేతుల మీదుగా ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం హరీష్ బాబు, డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి పథకాల వల్ల విద్యార్థులకు వరంలాగా మారాయని, కంటిపట్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలను పాటిస్తూ కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని వారు తెలిపారు. అదేవిధంగా తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నల్లబల్ల పైన వ్రాసేటటువంటివి అందరికీ కనపడుతున్నాయా లేదా అన్న వాటిని గుర్తించి, తల్లిదండ్రులకు, హెడ్మాస్టర్లకు సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, ఆప్తాలమిక్ ఉరుకుందప్ప, హెడ్మాస్టర్ రాంప్రసాద్, వైద్య సిబ్బంది మోహన్ గౌడ్, మారుతి, బిజెపి నాయకులు పోతుకుంట రాజు, టిడిపి వార్డ్ ఇన్చార్జులు షీలా మూర్తి, కేతా శ్రీనివాసులు, వాసుదేవ, పరహాన బేగం, మనోహర ఆచారి, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
కంటి పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడే చక్కటి చదువు లభిస్తుంది
- Advertisement -
RELATED ARTICLES


