- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 17వ వార్డు సంజయ్ నగర్ కు చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బుగ్గ నాగభూషణ (55) ఆకస్మికంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లతో, నాయకులతో వారి ఇంటి వద్దకు చేరుకొని, పార్టీవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రపు శ్రీనివాస్ రెడ్డి, మాసపల్లి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.


