విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేనేత నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత సంఘం నాయకురాలు, బీసీ సంక్షేమ మహిళ రాష్ట్ర అధ్యక్షులు వారి స్వగృహంలో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 22 రాజకీయాలకు అతీతంగా ఐక్య చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి లో జరిగే చేనేత గర్జన పై చేనేత నాయకులు అనేక సమస్యలను చర్చించడం జరిగింది. ఈ సందర్బంగా చేనేత నాయకులు మాట్లాడుతూ కనుమరుగు అవుతున్న చేనేత పరిశ్రమను, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ చేనేత గర్జన ద్వారా పలువిషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులు నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేతన్న భరోసా రూ. 25 వేల రూపాయలు వెంటనే అమలు పరచాలని, అదే విదంగా చేనేత పై జిఎస్టి ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలనీ,చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన 203 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలిపారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉపాధిని కోల్పోయిన చేనేత కార్మికులకు రూ. 10 వేలు ఆర్దిక సహాయాన్ని అందించాలని, నేతన్నలందరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22న మంగళగిరిలోని నేతన్న సర్కిల్ వద్ద జరగనున్న చేనేత గర్జనలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిర్రాజు రవి, బుడగ వెంకటనారాయణ,నీలూరి శ్రీరాములు, పోలావెంకటనారాయణ,యుగంధర్,పల్లా నవీన్, గిర్రాజు శశి,దాసరి శ్రీనివాసులు, గడ్డం పార్టసారధి,కోనేటి వెంకటేష్, భాస్కర, గుర్రం వెంకటస్వామి జల్లా కార్తీక్,తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


