Homeఆంధ్రప్రదేశ్రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర / రాజా (విజయనగరం జిల్లా) : రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు సెంటర్ నెంబర్ 02005 లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌లో భాగంగా జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చీఫ్ సూపరింటెండెంట్ దూసి రామారావు తెలిపిన వివరాల ప్రకారం,
జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ వరకు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ రోజు ఉదయం నిర్వహించిన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలకు 36 మంది విద్యార్థులకు గాను 34 మంది హాజరుకాగా, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 75 మందికి గాను 68 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు