Homeజిల్లాలుకర్నూలుదేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : లేబర్ కోడ్లు రద్దుకై జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత లేబర్ కోడ్ లను అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. కేవలం కార్పోరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చిందని, దీని వల్ల ఒక్కటైనా కార్మికులకు ఉపయోగపడే అంశం ఉందా అని వారు ప్రశ్నించారు. పని గంటలను కూడా 8 గంటల నుంచి 12 గంటలకు పెంచిదన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకం కూడా కేంద్రం నీరు గార్చిందన్నారు. అలాగే విద్యుత్ సవరణ, విత్తనాల సాధన బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేటందుకు నేడు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చాల ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి దేవదాసు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, నాయకులు నాగరాజు, రెక్కల గిడి, వీరేష్, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు