డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్. చెన్నారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం గావించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ నందు, కాలేదుల యందు గల పిల్లలకు, అంగనవాడి పిల్లలకు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ 400ఎంజి మాత్రలు పంపిణీ చేసి పిల్లలకు మింగించడం జరిగిందన్నారు. ధర్మారం డివిజన్లోని మొత్తం పిల్లలు 80, 418 గాను72325 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం అన్నారు. డివిజన్ మొత్తము 89 శాతము నమోదు కావడం జరిగింది అన్నారు.హాజరు గాని పిల్లలందరికీ ఫిబ్రవరి 24 తేదీన మాపప్ డే రోజున వేయడం జరుగుతుంది అని తెలిపారు. ఎన్ డి డి ప్రోగ్రామును విజయవంతం చేసినందుకు గాను డివిజన్ ఇంచార్జ్ డిప్యూటీడిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చెన్నారెడ్డి డాక్టర్స్ కు,వైద్య సిబ్బందికి, అంగన్వాడి సిబ్బందికి టీచర్స్ కు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


