కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; వైసీపీ తప్పులను వైయస్సార్ తో ముడి పెట్టడం సరికాదు అని కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి తీరు ఇలా ఉందని,తిరుమల పవిత్రతపై పాపం వైసీపీ చేస్తే ,వైఎస్సార్‌కు చుట్టడం చంద్రబాబుకి భావ్యం కాదు అని తెలిపారు.చంద్రబాబు ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అని, వైఎస్సార్‌కు చంద్రబాబు క్షమాణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్ ఏడు కొండలను రెండు కొండలను చేయాలని ఏనాడూ అనుకోలేదు అని వైఎస్సార్‌ది సంక్షేమ పాలనైతే .. వైసీపీది దోచుకుతిన్న పాలన అని వారు విమర్శించారు.వైసీపీ అరాచకాలతో వైఎస్సార్‌కు సంబంధం లేదు అని వారు స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో వైఎస్సార్ లేరు అని, రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి అని తెలిపారు. మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
వైసీపీ తప్పులను వైఎస్సార్‌తో ముడిపెట్టడం సరికాదు
- Advertisement -
RELATED ARTICLES


