తీర్మానానికి భారత్ సహా 130 దేశాల ఆమోదం: ఓటింగ్‌కు చైనా, రష్యా దూరం
న్యూయార్క్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ తక్షణమే దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది. బహ్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. భారత్ సహా 130 దేశాలు ఇందుకు కో`స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్మానం పేర్కొంది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్ప్పు కలిగిస్తున్నట్లు వెల్లడించింది. ‘బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులు వెంటనే నిలిపివేయాలని ఐరాస భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ చర్యలను ఐరాస ఖండించింది. అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ, ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు, ఇంకొందరు ఉన్నత సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఐరాస భద్రతా మండలి ప్రస్తావించకపోవడాన్ని రష్యా, చైనా దేశాలు తీవ్రంగా విమర్శించాయి.


