Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం

ఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా)

ఉరవకొండ పట్టణంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ముందుకొచ్చింది. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉచిత మజ్జిగ మరియు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సబ్ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా రహదారులపై ప్రయాణించే వారు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు ఈ కేంద్రం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కిష్టప్ప మాట్లాడుతూ, సమాజానికి తమవంతు సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ నాయకులు ఎర్రి స్వామి, డేవిడ్, వెంకటస్వామి, దత్తాత్రేయ, సూర్యనారాయణ తమన్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు