Homeతెలంగాణరైతు భరోసా డబ్బులు జమ..

రైతు భరోసా డబ్బులు జమ..

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది.ఇప్పటికే మార్చిలో మొదటి విడత నిధులు విడుదల చేయగా, ఆ సమయంలో ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించారు.ఇప్పుడు రెండో విడతలో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు.
అర్హులైన రైతులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు రావడం ద్వారా తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదా తెలుసుకోవచ్చు.లేకపోతే బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయడం ద్వారా కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం సుమారు రూ.5,653 కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.
రైతు భరోసా పథకం కింద మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు