Homeజిల్లాలుఅనంతపురంముస్లిం విద్యార్థులకు ‘తాలీమ్-ఎ-హునర్’ టాలెంట్ టెస్ట్

ముస్లిం విద్యార్థులకు ‘తాలీమ్-ఎ-హునర్’ టాలెంట్ టెస్ట్

- Advertisement -

​విశాలాంధ్ర-రాప్తాడు: ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థుల కోసం ‘తాలీమ్-ఎ-హునర్’ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు బోర్డు చైర్మన్ షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన 250 మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, వసతి, భోజనం కల్పిస్తారు. పదవ తరగతిలో 450 మార్కులు లేదా 75 శాతం (సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ) మార్కులు సాధించి, తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం విద్యార్థులు దీనికి అర్హులు. ఆసక్తి గల వారు మే 12వ తేదీ లోపు హెచ్.టి.టి.పి.ఎస్://ఏపి వక్ఫ్ బోర్డ్.ఇఎల్91.కామ్/ఆర్.ఇ.హెచ్/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మే 17న పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 6303325356, 8978452495 నంబర్లను సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు