ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫెయిల్ అయిన 331 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులను కేటాయించిన నాలుగు కేంద్రాలలో నిర్వహిస్తున్నామని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు తప్పనిసరిగా ఆ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత చెందేలాగా గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. తదుపరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన (అనుతీర్ణులు) విద్యార్థులకు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 63 మంది విద్యార్థులు, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల లో 107 మంది విద్యార్థులు, అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాల లో 69 మంది కొత్తపేటలోని ఎస్పీ సిహెచ్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 92 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులను (నాలుగు కేంద్రాలు) నిర్వహిస్తున్నామని తెలిపారు. మే నెల ఆరవ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 7:45 నిమిషముల నుండి 11:45 నిమిషముల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు రెండు సబ్జెక్టులపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్ల, సీఆర్పీలు పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. కావున సంబంధిత ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా పంపించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు. అట్లు లేనియెడల కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పరీక్ష కేంద్రాలకు తప్పనిసరిగా పంపించినట్లయితే ఫెయిల్ అయిన సబ్జెక్టులలో తప్పక ఉత్తీర్ణత చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశమును తల్లిదండ్రులతోపాటు ప్రధానోపాధ్యాయులు, ఫెయిల్ అయిన సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక శ్రద్ధను కనపరిచితేనే ఉత్తీర్ణత వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు.
పదవ తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు
- Advertisement -
RELATED ARTICLES


