Homeఆంధ్రప్రదేశ్అరసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

అరసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 83 వ వార్షికోత్సవం సందర్భంగా 20 వ రాష్ట్ర సభలు స్థానిక బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్లు అరసం సభలు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ తెలిపారు. ఈ సందర్భంగా అరసం సభలకు సంబంధించిన కరపత్రాలు ఆహ్వాన పత్రికలను బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవన్ గ్రంథాలంలో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యువశ్రీ మురళి, గంటా మోహన్, నెమిలేటి కిట్టన్న, రచయితలు రాఘవ శర్మ, విశాలాంధ్ర పబ్లికేషన్స్ పుట్టా హరినాథ రెడ్డి, సత్యాల బాదుల్లా, డా.ప్రసాద్, పురుషోత్తం నాయుడు, మదన్ మోహన్ రెడ్డి, యువరాజు, దేవరాజులు రెడ్డి, చంద్ర, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు