గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఒక వరం అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం జరిగిందని తెలిపారు. నీతి కథలు ముకుంద టీచర్ ద్వారా చెప్పించడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరిప్రసాద్ రావడం జరిగిందని వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు బిస్కెట్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నేటి ఈ శిక్షణా కార్యక్రమంలో 32 మంది విద్యార్థులు రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము, శివమ్మ, రమణా నాయక్, గంగాధర్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం
- Advertisement -
RELATED ARTICLES


