వాషింగ్టన్: అమెరికా`ఇరాన్ శాంతి చర్చలు వేళ అమెరికా సెనెటర్ పాక్‌పై అసహనం వ్యక్తం చేశారు. శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వంపై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం విమర్శలు చేశారు. పాక్ తీరు పెద్ద సమస్యగా ఉందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్‌తో శాంతిచర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్‌తో వైరం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీన్ని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే లిండ్సే పాక్ వ్యవహారంపై విరుచుకుపడుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పాక్ మధ్యవర్తిగా వ్యవహరించడమే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై సుదీర్ఘకాలంగా అది విద్వేషంతో రగిలిపోతుందన్నారు. టెలఅవీవ్‌కు వ్యతిరేకంగా గతంలో పాక్ ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల అమెరికాతో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక విమానాలను పాక్ ఎయిర్‌బేస్‌లలో పార్క్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని లిండ్సే తన పోస్టులో ప్రస్తావిస్తూ…ఈ విషయం అబద్ధమని తోసిపుచ్చారు.
పాక్ మధ్యవర్తిత్వం తీరు బాగోలేదు: అమెరికా సెనెటర్
- Advertisement -
RELATED ARTICLES


