అమెరికాలో 30 మంది భారతీయ డ్రైవర్లు అరెస్టు: త్వరలో డిపోర్ట్
వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించేందుకు అమెరికా కస్టమ్స్ Ê సరిహద్దు భద్రతా విభాగం ఆపరేషన్ చెక్‌మేట్‌ను ముమ్మరంగా సాగిస్తోంది. వారం రోజుల్లో 52 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో 36 మంది అక్రమ సెమీ ట్రక్ డ్రైవర్లు కాగా వీరిలో 30 మంది భారతీయులే ఉన్నారని వెల్లడించింది. 30 మంది భారతీయులు వాణిజ్య ట్రక్ డ్రైవర్లు కాగా. మే 11`15 తేదీల్లో జరిగిన ఆపరేషన్‌లో భాగంగా వీరిని గుర్తించినట్లు అమెరికా కస్టమ్స్ Ê సరిహద్దు భద్రతా విభాగం వెల్లడించింది. గత నెలలో ఆరిజోనాలోని యూమా సెక్టార్‌కు చెందిన సరిహద్దు పహారా సిబ్బంది ‘ఆపరేషన్ చెక్మేట’లో అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 52 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ డ్రైవర్లలో 30 మంది భారతీయులు కాగా ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందినవారని గుర్తించింది. కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను వీరు కలిగివున్నట్లు తేల్చింది. కొందరి వద్ద లైసెన్సులే లేవని కూడా గుర్తించింది. ఫెడరల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న అధికారులు అక్రమ చొరబాటుదారులను త్వరలోనే వారి వారి స్వదేశాలకు పంపబోతున్నారు. వాణిజ్య ట్రక్కులు నడుపుతూ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వ్యక్తులను గుర్తించి, అరెస్టు చేయడమే ‘ఆపరేషన్ చెక్మేట’ ఉద్దేశంగా అధికారులు వెల్లడించారు. ప్రజా భద్రతకు హామీ ఇవ్వడమే కాకుండా, రోడ్ల ప్రమాదాలు తగ్గించేందుకే ఈ ఆపరేషన్ దోహదమవుతుందని అన్నారు. అరెస్టు చేసిన వారిని త్వరలోనే డిపోర్ట్ చేస్తామని ప్రకటించారు.


