శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యము అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి రోగులకు, సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా వారి సూచనలు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు రావాలని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరపున సేవా సమితి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి గల దాతలు సెల్ నెంబర్ 9966047044 కు గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవచేయుట మా ప్రధాన లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


