Homeఅడ్డగోలు విజిలెన్స్‌!

అడ్డగోలు విజిలెన్స్‌!

- Advertisement -
  • విచారణ పేరుతో ఏయూ సిబ్బందికి వేధింపులు
  • ప్రోటోకాల్ పాటించని అధికారులు
  • భయంతో సెలవులపై వెళుతున్న కొందరు
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో బాధితులు
  • ఎంపిక కమిటీలు సైతం విచారణకు రావాలని ఆదేశాలు

విశాలాంధ్ర-విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వివాదాల్లో చిక్కుకుంటోంది. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని, అక్కడి విద్యా వాతావరణాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విజిలెన్స్‌ అధికారుల విచారణ జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని విచారణ పేరుతో వేధింధిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నియామక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌, స్రూక్కటినీ కమిటీలను సైతం విజిలెన్స్‌ పరిధిలోకి లాగడంపై విద్యావేత్తల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) పాలకవర్గ ఆమోదం తప్పనిసరి. ఈ కమిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లతో పాటు ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారి సభ్యులుగా గతంలో అవినీతి ఆరోపణలు వస్తే ప్రభుత్వం ప్రాథమిక విచారణ కోసం ఒకరు లేదా ఇద్దరు ప్రొఫెసర్లు/రిటైర్డ్ ఐఏఎస్లతో కమిటీ వేసేది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తప్ప జరిగినట్లు తేలితేనే పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలొచ్చేవి. అయితే గత యాజమాన్యం హయాంలో జరిగిన నియామకాలు, ప్రాజెక్టులు, ఇతర విద్యా సంబంధిత కార్యక్రమాలపై నేరుగా విజిలెన్స్‌ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందటే ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ సంస్థ కాబట్టి విజిలెన్స్‌ విచారణ జరిపే హక్‌కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది జరుగుతున్న తీరు కలకలం రేపుతోంది. విజిలెన్స్‌ అధికారుల వేధింపుల కారణంగా ఆచార్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రశ్నలు, ఒత్తిళ్లకు భయపడి కొంతమంది సెలవులపై వెళ్లిపోగా, మరికొందరు ఊర్లు విడిచి వెళుతున్నారు. వేధింపులకు గురైన ఇద్దరు`ముగ్గురు దళిత, గిరిజన ఆచార్యులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నారని తెలిసింది. గత నియామకాలపై విజిలెన్స్‌ విచారణ అడ్డగోలుగా సాగుతోందనే విమర్శలున్నాయి. యూనివర్సిటీలో ఒక పోస్టు భర్తీ చేయాలంటే దానికి పారదర్శకమైన విధానం ఉంటుంది. నోటిఫికేషన్, దరఖాస్తులు, స్రూక్కటి, ఇంటర్వూయూ, తుది దశలో స్రూక్కటినీ, కమిటీ సర్టిఫికెట్ల పున’పరిశీలన వంటివి జరుగుతాయి. ఇంటర్వూయూ బోర్డులో యూనివర్సిటీ బయటి ప్రాంతాలకు చెందిన ముగ్గురు ‘సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌’ (విషయ నిపుణులు)తో పాటు బీసీ, ఎస్సీ, మహిళా నామినీలు కూడా ఉంటారు. నిపుణులిచ్చే మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా తయారవుతుంది. దానిని ఎంపిక కమిటీ చైర్మన్‌గా వీసీ, రిజిస్ట్రార్ పరిశీలించి సంతకాలు చేస్తారు. ఆపై ఈసీ (పాలకవర్గం) ముందు పెట్టి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆయా స్రూక్కటినీ కమిటీలు, సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా విచారణ రావాలని ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది. ప్రోటోకాల్, విజిలెన్స్‌ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్లను నేరుగా విచారణకు పిలవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.
యూనివర్సిటీ ప్రొఫెసర్ లేదా ఆ స్థాయి అధికారులు ప్రభుత్వంలో చాలా ఉన్నతమైన హోదాను (సాధారణంగా క్లాస్-1 లేదా గెజిటెడ్ గ్రూప్-ఏ హోదాకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ) కలిగి ఉంటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానం పోలీస్ లేదా విజిలెన్స్‌ శాఖలో ఉన్నతాధికా రులతో పోలిస్తే లోయర్ కేడర్లోకి వస్తుంది. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి విచారణ లేదా తనిఖీ జరుగుతున్నప్పుడు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేరుగా వారికి సమన్లు పంపి, తన ముందు హాజరుకావాలని ఆదేశించడం సాధారణంగా ప్రోటోకాల్ కాదు. ప్రొఫెసర్‌కు నేరుగా నోటీసు ఇవ్వడానికి బదులు, ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా సమాచారాన్ని పంపడం అధికారిక పద్ధతి. కాగా, నిబంధనలకు విరుద్ధంగా విజిలెన్స్‌ సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో యూనివర్సిటీ ఇన్చార్¨ వైస్ ఛాన్సలర్, రెకాటర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, డీన్, డైరెక్టర్లుగా పనిచేసిన అధికారులు, సీనియర్ ఆచార్యులను విజిలెన్స్‌ కార్యాలయానికి పిలిచి… అక్కడికకక్కడ… అప్పటికప్పుడు సమాధానం చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్‌ అధికారులు తమ వద్దకు వస్తే కావాల్సిన సమాచారం ఇచ్చి పూర్తిగా సహకరిస్తామని ఆచార్యులు అంటున్నారు. గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగాపుల పడే పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా ప్రొఫెసర్‌ను రాత్రి 9 వరకు విజిలెన్స్‌ కార్యాలయంలోనే ఉంచేసినట్టు ఆమె భర్త తెలిపారు. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేస్తారా అని విద్యా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదిఏమైనా ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రకు మచ్చ తెచ్చే ఈ అంశంపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించి, విజిలెన్స్‌ విచారణ ఒక పద్ధతి ప్రకారం, విద్యావేత్తల గౌరవానికి భంగం కలగకుండా జరిగేలా చూడాలని యూనివర్సిటీ వర్గాలు కోరాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు