Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

- Advertisement -

— మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు హెచ్డి ఎస్ కమిటీ వైద్యులతో ఆసుపత్రి సేవలపై నిర్వహించిన సమీక్షలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.1.66 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలతో ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించడం జరిగింది అని తెలిపారు. తదుపరి
ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పెండింగ్ అభివృద్ధి పనులపై వారు ఆరాధిషారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యమును అందించాలని, రోగులతో మర్యాదగా మానవత్వంతో వ్యవహరించాలని వారు స్పష్టం చేశారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత సి ఎస్ ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.68 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించబడినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా సుమారు రూ.98 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ఆసుపత్రికి అందించబడినట్లు చెప్పారు. తాము అందించిన ఈ వైద్య పరికరాలు కేవలం ఆసుపత్రిలో ఉండటానికే కాకుండా, ప్రజలకు సమయానికి నాణ్యమైన చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రోగి ఆసుపత్రికి వచ్చిన క్షణం నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఆలస్యం, నిర్లక్ష్యం, అసౌకర్యం ఉండకూడదని వైద్యులు, వైద్యాధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదల ఆసుపత్రి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ నమ్మకంతో వచ్చే వైద్య సేవల కేంద్రం కావాలి. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్యాధికారులు, డాక్టర్ సంకారపు నరసింహులు, డాక్టర్ సోనియా, ఆర్.ఎం హరి శ్రీనివాసులు, సుబ్బారావు, గుండా పుల్లయ్య, డిఆర్. నజీర్, డిఆర్. ముక్తియార్ అహ్మద్, డిఆర్. నితిన్, డిఆర్. రాముడు, డిఆర్. నివేదిత, డిఆర్. చంద్రిక, ఎన్ఎస్ రమాదేవి, హెడ్ సిస్టర్. పూర్ణచంద్ర, ఇంజినీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు