Homeజిల్లాలుఅనంతపురంభక్తుల భద్రతే లక్ష్యం.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

భక్తుల భద్రతే లక్ష్యం.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

- Advertisement -

ఆకతాయిలపై ఉక్కుపాదం.. అల్లర్లు సృష్టిస్తే కేసులే: ఎస్సై సాగర్

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరిగే కుళ్ళాయి స్వామి ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై సాగర్ మాట్లాడుతూ ఉత్సవాల్లో ఆకతాయితనం, అసాంఘిక కార్యకలాపాలు, మహిళలు, చిన్నారులు, భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఉత్సవాల పేరుతో మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, గొడవలకు దిగడం, ఇతర భక్తులకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.ఉత్సవాలకు వచ్చే భక్తులు తమ నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏవైనా సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఉత్సవాలకు వెళ్లే భక్తులు తమ ఇళ్ల భద్రత విషయంలో కూడా నిర్లక్ష్యం చేయవద్దని ఎస్సై సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు, నగదు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా వీలైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. తప్పనిసరిగా ఇంట్లో ఉంచాల్సి వస్తే భద్రమైన ప్రదేశాల్లో దాచిపెట్టాలని, ఇంట్లో ఎవరూ లేరనే విషయం బయటివారికి తెలిసేలా వ్యవహరించవద్దని సూచించారు. ఉత్సవాల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా భారీ నష్టానికి దారితీయవచ్చని హెచ్చరించారు.అధిక శబ్దాలతో సౌండ్ సిస్టమ్‌ల వినియోగం వల్ల చిన్నారులు, వృద్ధులు, ఇతర భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, శబ్ద కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అలాగే వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.ప్రతి ఏడాది కుళ్ళాయి స్వామి ఉత్సవాలకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా భారీగా జనసందోహం ఉండే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, గ్రామ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఁఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఆకతాయిలకు ఎలాంటి ఉపశమనం ఉండదు.ఉత్సవాల సందర్భంగా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని ఎస్సై సాగర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు