విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యర్రగుంట సమీపంలో నూతనంగా నిర్మించిన వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూమ్‌ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని వేణు చిలకం మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి షో రూమ్ను వారు పరిశీలించారు. తదుపరి యజమాని వేణు షో రూమ్ వివరాలను తెలియజేశారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా సుమారు 80 షోరూమ్‌లను విజయవంతంగా నడుస్తున్నాయని, ధర్మవరంలో వేణు ఇటువంటి షోరూమ్ ను నడపడం అభినందనీయమని, అంతేకాకుండా ధర్మవరం వాసి కావడం విశేషమని తెలుపుతూ వేణు ను అభినందించారు. స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి యువతకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో వేణు మోటార్స్ మరింత అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వేణు మోటార్స్ ఎలక్ట్రికల్ టూ వీలర్ షోరూం ప్రారంభించిన చిలకం మధుసూదన్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


