విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో వివిధ గ్రామాల నుంచి 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో కూనిపాలెం జట్టు తమ ప్రతిభతో విజేతలుగా మరియు చుండి యువత క్రికెట్ జట్టు రన్నర్స్‌గా నిలిచారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ, జడ రవీంద్ర విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీ ని మరియు ప్రైజ్ మని అందజేసి వారిని అభినందించారు.మొదటి విజేత కు ట్రోపి మరియు 10,000రూపాయలు, రన్నరప్ కు ట్రోపి మరియు 5000రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గెలుపు ఓటములు సహజమని క్రీడల్లో పాల్గొనడమే గొప్ప అని పేర్కొన్నారు. అన్ని జట్లకూ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కామినేని అశోక్,చుండి ఆదర్శ పాఠశాల చైర్మన్ చొప్పర వసంత రావు,చుండి గ్రామ పార్టీ అధ్యక్షులు చొప్పర రాఘవులు,నాయకులు చొప్పర బ్రహ్మయ్య, కామినేని వీరయ్య, చొప్పర వీర ప్రసాదు, చొప్పర మాల్యాద్రి క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.