లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల మున్సిపల్ హై స్కూలుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఒక మైకు కుర్చీలను హెడ్మాస్టర్ వెంకటరమణ కు లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైనటువంటి సామాగ్రిని లయన్స్ క్లబ్ ద్వారా అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ లయన్స్ క్లబ్ వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఆంజనేయులు, సూర్యనారాయణ, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
మునిసిపల్ హైస్కూల్ కు మైకు, కుర్చీలు వితరణ…
- Advertisement -
RELATED ARTICLES


