Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిధులలో మంచితనము, పారదర్శకత ఉంటేనే గుర్తింపు ఉంటుంది

విధులలో మంచితనము, పారదర్శకత ఉంటేనే గుర్తింపు ఉంటుంది

- Advertisement -

ఆర్డీవో కార్యాలయ డివో. ఎస్. ఖతిజున్ ఖుఫ్రా
విశాలాంధ్ర ధర్మవరం;; విధులలో మంచితనము, పారదర్శకత ఉంటేనే మంచి గుర్తింపు లభిస్తుందని డివిజనల్ పరిపాలన అధికారిని ఖతిజున్ కుప్రా తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండల ఎమ్మార్వో స్వర్ణలత పదవీ విరమణ సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. అనంతరం వారు చేసిన సేవలను కొనియాడారు. తదుపరి డివిజినల్ పరిపాలన అధికారి కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు , సిబ్బంది స్వర్ణలత సుదీర్ఘ ప్రభుత్వ సేవలను కొనియాడుతూ, ఆమె సేవలను ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శాలువా, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎస్. ఖతిజున్ ఖుఫ్రా తోపాటు రెవెన్యూ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు