Homeజిల్లాలుఅనంతపురం27న జిల్లావ్యాప్తంగా సీపీఐ ధర్నాలు.. ...

27న జిల్లావ్యాప్తంగా సీపీఐ ధర్నాలు.. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనల్లో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్, మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ప్రకటించారు.

శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమిస్తున్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా పోలీసు దమనకాండతో ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పరీక్షలకు సంబంధించిన ఘటనల నేపథ్యంలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ ను ఇప్పటివరకు మోదీ సర్కారు ఆమోదించలేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 27న జరిగే ఆందోళన కార్యక్రమాలను ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, టి. నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు