విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని టీడీపీ మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్టీఎస్ మాజీ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, శ్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు తదితర పథకాలు పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి బొగ్గుల నరసన్న, సుదర్శనం, ఇస్సాకు, మోజస్ తదితరులు పాల్గొన్నారు.


