Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్త్రీల ఉచిత వైద్య చికిత్స శిబిరం.. రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ

స్త్రీల ఉచిత వైద్య చికిత్స శిబిరం.. రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్త్రీల ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయసింహ, కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, ధర్మవరం గండికోట హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గండికోట హాస్పిటల్ ప్రత్యేక స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ తోట దివ్య దుర్గ స్త్రీలకు వైద్య చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైద్య చికిత్సలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పెద్దారెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సోలి గాళ్ళ వెంకటేశులు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ,సత్రశాల ప్రసన్నకుమార్, నాగభూషణ, నరేందర్ రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు