ధర్మవరం ఆప్టికల్ అసోసియేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నుంచి లైన్స్ కార్డును బహిష్కరించే వరకు శాంతియుత ధర్నాలు కొనసాగుతాయని ధర్మవరం ఆర్టికల్ అసోసియేషన్ కమిటీ వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని స్థానిక ఆప్టికల్ వ్యాపారుల చేపట్టిన మా ఆందోళన కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతాయని తెలిపారు.ధర్మవరం నుంచి లెన్స్‌కార్ట్‌ను బహిష్కరించే వరకు మా ధర్నా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ధర్మవరం ఆప్టికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
మా వ్యాపార పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని , మీడియా ద్వారా సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు.ధర్మవరం ప్రజలు, వినియోగదారులు మరియు అన్ని వర్గాల ప్రజలు స్థానిక వ్యాపారులకు అండగా నిలిచి తమ మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆప్టికల్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.
లెన్స్‌కార్ట్‌ను బహిష్కరించే వరకు శాంతియుత ధర్నాలు కొనసాగుతాయి..
- Advertisement -
RELATED ARTICLES


