Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు కేటాయించాలి

ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు కేటాయించాలి

- Advertisement -

ప్రయాణికుల రద్దీతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థుల ప్రయాణం
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం ప్రయాణ ప్రాంగణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల సమయంలో కళాశాలకు వెళ్లే క్రమంలో సాధారణ ప్రయాణికులు, ఇతర విద్యార్థులు ( ఎస్సీ ఎస్టీ బిసి ఓసి, వర్గాల గర్ల్స్ అండ్ బాయ్స్) అందరూ ఒకే బస్సులో ప్రయాణించాల్సి రావడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో అత్యంత ప్రమాదకర ప్రయాణం:ఉదయం పూట బస్సుల్లో స్థలం లేక విద్యార్థులు బస్సు ఇరువైపులా, ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సి వస్తోంది. ఆడపిల్లల భద్రత పరిస్థితి:ఒకే బస్సులో విపరీతమైన తోపులాటలు, రద్దీ ఉండటం వల్ల విద్యార్థినులు ప్రయాణంలో తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారు.
సమయానికి కళాశాలకు చేరలేకపోవడం: పరిమితికి మించి ప్రయాణికులు ఉండటంతో బస్సులు ఆలస్యమై విద్యార్థులు తరగతులకు సమయానికి హాజరుకాలేకపోతున్నారు.
ఆర్టీసీ డిపో అధికారులు సాయంత్రం సమయంలో పాలిటెక్నిక్ కళాశాలకు విడిగా సపరేట్ బస్సు నడుపుతున్నప్పటికీ, ఉదయం పూట మాత్రం ఎలాంటి ప్రత్యేక బస్సు కేటాయించలేదు. సాయంత్రం వేళల్లో కూడా రద్దీ తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి విద్యార్థుల భద్రతను దృష్ట్యా ఉదయం పూట కచ్చితంగా పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ప్రత్యేక (సపరేట్) బస్సును కేటాయించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు. అనంతరం
కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు మాట్లాడుతూ ఉదయం వేళల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం సపరేట్‌గా ప్రత్యేక బస్సును కేటాయించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఇప్పటికే అనేకమార్లు విన్నవించడం జరిగింది అని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించాలి అని తెలిపారు.కావున, ఆర్టీసీ డిపో అధికారులు , జిల్లా అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు, భద్రతను పరి పరిగణనలోకి తీసుకుని ఉదయం వేళ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు