Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చండి…

మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చండి…

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలో నిర్వహించిన 2025 మెగా డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై ఎన్డీఏ ప్రభుత్వం నీకు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్షలాదిమంది అభ్యర్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాడ మాడిందని దుయ్యబట్టారు. ఈ అక్రమాలకు తావు ఇచ్చిన విద్యా శాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పలు విద్యార్థి సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు హాజరై డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించడం జరిగిందని వారు తెలిపారు. డీఎస్సీని లక్షలాదిమంది పరీక్షలు రాస్తే, ఆ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల కాకుండా అలహరులకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి దారి తీసింది అని వారు తెలిపారు. అంతేకాకుండా మెగా డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు తాను ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. డీఎస్సీ పరీక్షల అనంతరం జీవో నెంబర్ 58 ద్వారా విడుదల చేసిన కొత్త జీవోలను 4…. 47 జీవోలను రద్దు చేయడం జరిగిన అక్రమాలకు సాక్ష్యం కాదా అని కేతిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో భాగంగా ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య కు 1;1 పద్ధతిన ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడంలో ఏంటి కారణమని వారు నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిపిఐ విచారణ జరపాలని లేదా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేసి, పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ డీఎస్సీ కుంభకోణం రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ పేద విద్యార్థులకు తీవ్రంగా డీఎస్సీలో అన్యాయం జరిగిందని వారు దుయ్యబట్టారు. విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘాలపై జీవోలు ఇచ్చి మరి ప్రజా సమస్యలు వినిపించకుండా వేధించడం సరైన కాదు అని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఎస్సి జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు అమర్నాథ్ రెడ్డి, పార్టీలు రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం గంగాధర నాయుడు, పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, ఏ ఐ ఎస్ ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్, ఏఐఎస్యూ నాయకుడు దామోదర్, పి ఆర్ ఎస్ వై ఎఫ్ నాయకుడు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు