Homeజాతీయంప్రెజ‌ర్ గ్రూప్‌గా ప‌నిచేస్తాం: అభిజీత్ దీప్కే

ప్రెజ‌ర్ గ్రూప్‌గా ప‌నిచేస్తాం: అభిజీత్ దీప్కే

- Advertisement -

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతానికి త‌మ పార్టీ ఓ ప్రెజ‌ర్ గ్రూపులా ప‌నిచేస్తుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తీసుకురావ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్ర‌స్తుత ద‌శ‌లో భార‌త్ ఇదే ఉద్య‌మాన్ని కోరుకుంటోంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న సీజేపీ కోర్ క‌మిటీ స‌మావేశాల నేప‌థ్యంలో ఆయ‌న రిపోర్టర్ల‌తో మాట్లాడారు. మీడియా, న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్నిగిల్లుతోంద‌ని, ఇలాంటి అంశాల‌పై తమ కోర్ క‌మిటీ మీటింగ్‌లో చ‌ర్చించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్‌, నిరుద్యోగం లాంటి అంశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిపారు. సామాజిక కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ మాకు మెంట‌ర్‌గా పనిచేస్తార‌ని సీజేపీ ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ అన్నారు. వారి నుంచి స‌ల‌హాలు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. సీజేపీ నిర‌స‌న వేళ విద్యార్థుల‌పై న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల‌ను ఎత్తివేసేలా వ‌త్తిడి తెస్తామ‌ని దాస్ తెలిపారు. ఈ అంశంపై ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చిస్తున్నామ‌న్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు