Homeఆంధ్రప్రదేశ్విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

- Advertisement -

భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాశాఖ మంత్రి, టీడీపీ నేతలు

సాగర నగరం విశాఖపట్నం క్రీడా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏర్పాటు చేస్తున్న ఃసెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ః నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అరిలోవ సమీపంలోని తోటగరువులో ఈ అకాడమీని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌కు పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం, పీవీ సింధు, క్రీడాశాఖ మంత్రితో కలిసి లోకేశ్ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

అనంతరం అకాడమీ భవన నమూనాను, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సౌకర్యాలను మంత్రి లోకేశ్ ఆసక్తిగా పరిశీలించారు. అకాడమీ లక్ష్యాలు, వసతుల గురించి సింధును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై రూపొందించిన ప్రత్యేక ఆడియో విజువల్ (ఏవీ) ప్రజెంటేషన్‌ను వీక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ భరణి, గ్రీన్ కో ఎనర్జీ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు