శాస్త్రవేత్త డా. రమ్య
విశాలాంధ్ర -ధర్మవరం: మండల పరిధిలోని “నా ఫస్ట్ నా అభిమానం 2.0 కార్యక్రమం కింద మల్బరీలో సమగ్ర కీటక వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం అనంతపురం శాస్త్రవేత్త డా. రమ్య వి. ఎస్. నిర్వహించారు. సాంకేతిక ప్రదర్శనలో భాగంగా మల్బరీలో సంభవించే ప్రధాన కీటకాలు , వ్యాధుల ఉత్పత్తి కారణాలు, వాటి ఆర్థిక ప్రాధాన్యం, శాస్త్రీయ నివారణ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రస్తుతం రైతులు అధికంగా ఎదుర్కొంటున్న వేరు కుళ్లు వ్యాధి గురించి వివరించడం జరిగిందన్నారు.
వ్యాధి నివారణకు సరైన మొక్కల మధ్య దూరం పాటించడం, నేల పీహెచ్ స్థాయిని పరీక్షించి తగిన విధంగా సరిచేయడం చేయాలన్నారు. అలాగే నేలలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించే ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు.అనంతరం వేరు కుళ్లు వ్యాధి సమగ్ర నిర్వహణపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించామన్నారు. ఇందులో సాఫ్ 2 గ్రాములు/లీటరు నీటికి కలిపి మొక్కల అడుగు భాగంలో ద్రావణాన్ని పోయాలని తెలిపారు.10 రోజుల వ్యవధిలో రెండవసారి ఇదే విధంగా సాఫ్ ద్రావణాన్ని మళ్లీ వినియోగించాలని సూచించడం జరిగిందన్నారు. అనంతరం మరో 10 రోజుల తర్వాత మూడవ విడతలో మిస్టర్ ప్రో 5 మి.లీ./లీటరు నీటికి కలిపి, వ్యాధి సోకిన ప్రతి మొక్కకు 10 లీటర్ల ద్రావణం, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన ప్రతి మొక్కకు 5 లీటర్ల ద్రావణం నేలలో పోయాలని రైతులకు ప్రదర్శించి వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు శోభారాణి ,ధర్మవరం సహాయ సంచాలకురాలు రాజేశ్వరి , దామోదర్ , పట్టు అభివృద్ధి అధికారి,ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పట్టు రైతులు పాల్గొని శాస్త్రవేత్తలు, అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
మల్బరీలో సమగ్ర కీటక వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమం..
- Advertisement -
RELATED ARTICLES


