రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పటల్ ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాల యందు ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి పెద్దారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండలి కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా కంటి ఆపరేషన్, ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. కంటి వైద్య చికిత్సలు చేసుకునేవారు రేషన్ కార్డు, లేదా హోటల్ గుర్తింపు కార్డులతో ఏదైనా రెండు జిరాక్స్ కాపీలు మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. అదేవిధంగా క్యాంపుకు వచ్చి వారు బీపీ షుగర్ ఎక్కువ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకుని తగ్గించుకొని రావాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ అండ్ కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం వీరి కోడలు దాసరి రమాదేవి కుమారుడు డివి వెంకటేశులు (చిట్టి )అండ్ సన్స్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రతినెలా నాలుగవ ఆదివారం పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రిలో డాక్టర్ నరసింహులు బిపి ,షుగర్ పేషెంట్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ ఉచిత కల్తి వైద్య శిబిరమును పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు, కొండయ్య, నాగభూషణ, పెరుమాళ్ళ దాస్ తదితరులు పాల్గొన్నారు.
9న ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


