Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత బి. ఆదినారాయణ

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత బి. ఆదినారాయణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చంద్రబాబు నగర్ కి చెందిన కీ శే బుధరపు ఆదినారాయణ (59) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా, వారు నేత్రధానం కి ఒప్పుకోవడం తో జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత భార్య సరస్వతి కుమారుడు తిరుమలేసు, కోడలు మౌనిక, అన్నలు బుధరపు బాలకృష్ణ, రామక్రిష్ణకు సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు- గాజుల సురేష్, ఉపాధ్యక్షులు- టి. చంద్రశేఖర్ రెడ్డి .సెక్రటరీ- జూజారు రఘు, గుద్దిటి ధనుంజయ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేత్రదానం చేసేవారు ఈ క్రింది సెల్ నెంబర్లకు
9392323605,9666629841
9059017583,8247724335
9492323912,9703126122 సంప్రదించవచ్చునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు