Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం అమలు చేయాలని….ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్

అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం అమలు చేయాలని….ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; అర్హులైన చేనేత కార్మికులకు నేతరణ సేవా పథకం అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేనేత జాతీయ దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీజీకి రేషం మాల తో సత్కరించి, చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జె .వి. రమణ ,చేనేత జిల్లా నాయకులు ఎస్ హెచ్ భాష, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ భారతదేశంనకు స్వాతంత్రం రాక మునుపు నుంచి చేనేత కార్మికులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేకమంది ప్రాణాలు అర్పించడం జరిగినదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వృత్తిని కాపాడాలని, చేనేత వృత్తి రక్షణ కోసం ముఖ్యంగా 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి చేనేత కార్మికునికి బ్యాంకులలో ఐదు లక్షల రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా ఇవ్వాలని, చేనేత పాత రుణాలను రద్దు చేయాలని ,చేనేత పైన జిఎస్టి ని రద్దు చేయాలని తదితర విషయాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పి రాష్ట్ర నాయకులు మంజుల నరేంద్ర,చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఖాదర్బాషా, గుంపు హరి , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అయుబ్ ఖాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున ,కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బత్తల కదిరప్ప, చేనేత కార్మిక సంఘం నాయకులు చౌడప్ప, అన్నం సూరి, పులిచెర్ల హరి వి. వెంకటస్వామి ,కొప్పల రాధాకృష్ణ ,మంజుల నల్లప్ప, లోకేష్ ,రషీద్, గోగుల ఆంజనేయులు, రాధాకృష్ణ మొదలగు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు