Homeక్రీడలుభారత అండర్‌-19 జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

భారత అండర్‌-19 జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

- Advertisement -

ఆస్ట్రేలియా యువ జట్టుతో భారత్‌లో జరగనున్న సిరీస్‌కు బీసీసీఐ భారత అండర్‌-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా మాజీ దిగ్గజాలు వీరేందర్‌ సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ల కుమారులు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ చోటు సంపాదించారు. ఆస్ట్రేలియాతో జరిగే యూత్‌ వన్డే సిరీస్‌కు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ ఎంపికయ్యారు.భారత్‌-ఆస్ట్రేలియా అండర్‌-19 జట్లు మూడు వన్డేలతో పాటు రెండు మల్టీ-డే మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.వన్డే సిరీస్‌లో లక్ష్య రాయ్‌చందాని భారత జట్టుకు నాయకత్వం వహించనుండగా.. యశ్‌వర్దన్‌ చౌహాన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మల్టీ-డే మ్యాచ్‌లకు యశ్‌వర్దన్‌ చౌహాన్‌ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందాని ఉప సారథిగా వ్యవహరిస్తారు.

ఆర్యవీర్‌కు తొలిసారి అవకాశం..
టీమిండియా మాజీ విధ్వంసక ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌కు భారత అండర్‌-19 జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చింది.18 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్‌ గతంలో కూచ్‌ బెహర్‌ ట్రోఫీ-2024లో ఢిల్లీ అండర్‌-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్‌ కేవలం 309 బంతుల్లోనే 297 పరుగులు చేశాడు.ట్రిపుల్‌ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ.. అతడి భారీ ఇన్నింగ్స్‌ అప్పట్లో క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌-2026లోనూ ఆర్యవీర్‌ పోటీతత్వ క్రికెట్‌ ఆడాడు. ఆ టోర్నీలో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

జట్టులో కొనసాగనున్న అన్వయ్
రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ ఇప్పటికే భారత అండర్‌-19 జట్టులో ఆడిన అనుభవం ఉంది.తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కూడా అతడు తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.16 ఏళ్ల అన్వయ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గత నెలలో శ్రీలంక పర్యటనలో భాగంగా భారత అండర్‌-19 జట్టు ఆడిన రెండు యూత్‌ వన్డేల్లో అతడు పాల్గొన్నాడు.ఆ రెండు మ్యాచ్‌ల్లోని రెండు ఇన్నింగ్స్‌లను కలిపి మొత్తం 101 పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియాతో యూత్‌ వన్డేలకు భారత జట్టు ఇదే..
లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్‌),

యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (వైస్‌ కెప్టెన్‌),

రజత్‌ భగేల్‌ (వికెట్‌ కీపర్‌),

ఆర్యవీర్‌ సెహ్వాగ్‌,

వీకే వినీత్‌,

కుశాగ్ర ఓజా,

అర్జున్‌ రాజ్‌పుత్‌,

మనాల్‌ చౌహాన్‌,

అన్వయ్‌ ద్రవిడ్‌ (వికెట్‌ కీపర్‌),

వి.యశ్‌వీర్‌,

రోహిత్‌ యాదవ్‌,

శవిన్‌ వినోద్‌,

మోహిత్‌ ఉల్వా,

చిగురుపాటి వెంకట,

కావ్యా పటేల్‌.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు