Homeజిల్లాలుఅనంతపురం​పట్టుదలే ఆయుధంగా నీట్ లో ప్రతిభ

​పట్టుదలే ఆయుధంగా నీట్ లో ప్రతిభ

- Advertisement -

: నంద్యాల మెడికల్ కాలేజీలో రాప్తాడుకు చెందిన మనుకృష్ణకు సీటు

సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన విద్యార్థి
పంపు మనుకృష్ణ

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : పట్టుదలనే ఆయుధంగా చేసుకుని, ప్రతిభ చాటి ప్రతిష్టాత్మక నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) సీటు కైవసం చేసుకున్నాడు. రాప్తాడు మండల కేంద్రం వ్యవసాయ కుటుంబానికి చెందిన పంపు ఇంద్రశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడైన పంపు మనుకృష్ణ, చిన్నప్పటి నుంచి ఏకాగ్రతతో చదువుతూ ప్రతి పరీక్షలోనూ విశేషమైన ఉత్తమ ప్రతిభ కనపరిచేవాడు. మనుకృష్ణ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు రాప్తాడు మండలం చిన్మయనగర్ లోని ఎల్.ఆర్.జి పాఠశాలలో చదివి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాడు. అనంతరం విజయవాడలోని గోశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 958 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించాడు. ఆపై నీట్ పరీక్షలో 490 మార్కులు సాధించి, బీసీ-బీ కేటగిరీలో 3,196 ర్యాంకును కైవసం చేసుకుని, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, చిన్నతనం నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధతో శ్రమించి డాక్టర్ సీటు సాధించడం పట్ల స్థానికులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మనుకృష్ణకు, అతని తల్లిదండ్రులు ఇంద్రశేఖర్, జ్యోతిలకు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు