విశాలాంధ్ర – కడియం : దేశంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత మరియు బీమా సేవలను అందించడం భారతీయ జీవిత బీమా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశమని రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచ్ మేనేజర్ రఘు అన్నారు. ఎల్ఐసి సంస్థ 70వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం కడియం దేవి చౌక్ సెంటర్లో “సరదాగా కాసేపు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ బ్రాంచ్ మేనేజర్ రఘు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించిందని, ప్రతి ఒక్కరూ ఎల్ఐసి గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి మన కార్యక్రమం వద్దకు వచ్చి మాట్లాడుతూ సామాన్యులకు ఎల్ఐసి చాలా చేరువుగా ఉంటుందని, ఎల్ఐసి తాలూకు సర్వీసులు అద్భుతంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఎల్ఐసి మీద మంచి అభిప్రాయంతో ఉన్నారని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అతని వివరాలు అడుగగా తానొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నానని, కానీ ఏ కస్టమర్ దగ్గరికి వెళ్లినా ఎల్ఐసి గురించి ప్రస్తావిస్తున్నారని తెలిపినట్లు పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందో, అందరూ గ్రహించవల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ఐసి డిజిటలైజేషన్ లో భాగంగా మై ఎల్ఐసి యాప్ ని ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ లో ఎల్ఐసి పాలసీలకు సంబంధించిన అన్ని సేవలను పొందవచ్చని, పాలసీదారులందరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎం అబ్రహం చక్రవర్తి, పి సాయిబాబు, ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఆదిమూలం సాయిబాబా, ఏజెంట్ లు వై మోహన్, ఇ రవికుమార్, కాశీ మహేశ్వర రావు, పి వెంకటేశ్వరరావు, పి వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసి వారోత్సవాలలో భాగంగా కడియంలో “సరదాగా కాసేపు” కార్యక్రమం
- Advertisement -
RELATED ARTICLES


