ప్రభుత్వ పథకాలకు తూట్లు పొడుస్తున్న (డిఏ) లు
( విశాలాంధ్ర) వత్సవాయి: రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ కి అర్జీ చేసుకోవాలనే మహోన్నత ఆలోచనతో నూతన పెన్షన్లను అర్జీ చేసుకొనుటకు అవకాశాన్ని కల్పించగా డిజిటల్ అసిస్టెంట్లు మాత్రం తమకేమీ పట్టనట్లు ఇష్టానుసారంగా తనకు నచ్చిన సమయాల్లో వచ్చి ఉద్యోగాలు చేసుకుని వెళ్తున్నారని పోలంపల్లి గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు మండలంలోని పోలంపల్లి గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మంగళవారం నాడు కార్యాలయంలో లేకపోవడంతో పెన్షన్ అర్జీదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు….. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత గడువు ఇవ్వడంతో పెన్షన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అర్జీదారులు సచివాలయానికి వెళ్లి అర్జీ చేసుకొనగా డిజిటల్ అసిస్టెంట్ మాత్రం అర్జీలను తీసుకొని పక్కనపెట్టి తర్వాత చేస్తాను అని అర్జీలను సేకరించి వారిని వెళ్ళిపొమ్మని చెబుతున్నారు.ప్రభుత్వం మాత్రం అర్జీ చేసిన వెంటనే సంబంధిత రసీదును తీసుకోమని స్పష్టంగా చెప్పినప్పటికీ పోలంపల్లి సచివాలయానికి మాత్రం ఇది మినహాయింపుగా ఉన్నట్లు కనబడుతుంది.కార్యాలయంలో ఇచ్చి వచ్చిన అర్జీ నమోదు చేశారో చెయ్యలేదో అని అర్జీదారులు అయోమయ పరిస్థితిల్లో ఉంటున్నారు
ప్రముఖ నాయకులు ఉన్న పోలంపల్లి గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎందుకు ఆలోచించడం లేదు అని కోణంలో పలువురు ఆరోపిస్తున్నారు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి పెన్షన్ అర్జీదారుల అర్జీలను త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పెన్షన్ అర్జీదారులు కోరుతున్నారు


