ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయడమైనది అని, సెప్టెంబర్ 18న
ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో తల్లితండ్రులతో కూడిన ఓటర్ లిస్టును ప్రదర్శించాలి అని, సెప్టెంబర్ 25న ఓటర్ లిస్టును తుది జాబితా ప్రకటించాలన్నారు. సెప్టెంబర్ 29న ఉదయం ఏడు గంటల నుండి 1.00 గంటల వరకు ఎన్నికలు నిర్వహించాలి అని, మధ్యాహ్నం 1.30 గంటలకు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి అని తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఎన్నిక కాబడిన పాఠశాల యాజమాన్య కమిటీతో ప్రతిజ్ఞ చేపించాలి అని, అదే రోజు సాయంత్రం మూడు గంటల నుండి3.30 ఇంతవరకు ఎన్నిక కాబడిన పాఠశాల యాజమాన్య కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని తెలిపారు. అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు.
ధర్మవరం ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోని 99 పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు..
- Advertisement -
RELATED ARTICLES


