Homeజాతీయంసచిన్‌తో పోలిక నాకొద్దు.. ఆయ‌న ఒక లెజెండ్: కోహ్లీ

సచిన్‌తో పోలిక నాకొద్దు.. ఆయ‌న ఒక లెజెండ్: కోహ్లీ

- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన పరుగుల దాహాన్ని కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్‌తో నిన్న‌ తిరువనంతపురంలో జరిగిన మొదటి వన్డేలో అద్భుత శతకంతో చెలరేగిన కోహ్లీ, భారత జట్టుకు ఘన విజయాన్ని అందించడమే కాకుండా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రెండు ప్రధాన రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 139 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ ఇన్నింగ్స్‌లో భాగంగా కోహ్లీ వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అయితే, కోహ్లీ కేవలం 303 ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరగా, సచిన్‌కు దీనికోసం 377 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అంటే.. సచిన్ కంటే 74 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ రికార్డును కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం.ఇదే మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డును కూడా అధిగమించాడు. భారత గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ (6,976) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లీ స్వదేశంలో 7,006 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 55వ సెంచరీ కాగా, లిస్ట్-ఏ క్రికెట్‌లో 60వ శతకం. ఈ క్రమంలో లిస్ట్-ఏ సెంచరీల విషయంలోనూ సచిన్ రికార్డును సమం చేశాడు.మ్యాచ్ అనంతరం తన రికార్డులు, సచిన్‌తో పోలికలపై కోహ్లీ వినమ్రంగా స్పందించాడు. ఁనాకు సచిన్ పాజీ ఎప్పటికీ సచిన్ పాజీనే. అత‌ను తన కాలంలో ఆటలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. అది సంఖ్యలు, పోలికలకు అతీతమైన విషయం. ప్రజలపై అత‌ను చూపిన ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుందిఁ అని వ్యాఖ్యానించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు