Homeజిల్లాలుకర్నూలురాయలసీమ హార్టికల్చర్ గ్లోబల్ హబ్‌పై అవగాహన సదస్సు

రాయలసీమ హార్టికల్చర్ గ్లోబల్ హబ్‌పై అవగాహన సదస్సు

- Advertisement -

– ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఐకేపీ కార్యాలయ ఆవరణలో ఏపీఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురువారం రాయలసీమ హార్టికల్చర్ గ్లోబల్ హబ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ ఉద్యాన పంటలు, ఆహార పదార్థాల ప్రదర్శనను ఎంపీడీవో ప్రభావతి, డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మన్న, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వసంత కుమార్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏపీవో చంద్రశేఖర్, ఈసీ ఖాదర్ బాషా పరిశీలించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించి అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయలసీమ హార్టికల్చర్ గ్లోబల్ హబ్‌ గా మార్చేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో ఉంచిన పంటలు, ఉత్పత్తుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, పంటల ఎంపిక, ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు పంటల వైవిధ్యాన్ని పెంచుకోవడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటల సాగుపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుని, ఆధునిక పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు