యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) అక్టోబర్ 4వ తేదీన ఆదివారం నిర్వహించే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరము సద్వినియోగం చేసుకోవాలని యువర్స్ ఫౌండేషన్ షీలా నాగేంద్ర, ఆర్ జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందరితో నివారణ సంస్థ.. శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు వంకదారి సుజాతమ్మ జ్ఞాపకార్థం భర్త వంకదారి రామచంద్ర గుప్తా వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు డాక్టర్ ఎస్ నాగమణి జ్ఞాపకార్థం, భర్త డాక్టర్ బి వి సుబ్బారావు వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బండ్లపల్లి జ్యోతిర్లత జ్ఞాపకార్థం భర్త బండ్లపల్లి రంగనాథం వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిష్ణాతులైన నేత్ర వైద్యులచే వైద్య చికిత్సలు అందించి ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచితంగా ఆపరేషన్, ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ, వై కే శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కేత లోకేష్ మాజీ కౌన్సిలర్, దేవతా సుబ్రహ్మణ్యం, పో లా ప్రభాకర్, చాంద్బాషా ,వెంకట సుకుమార్, డాక్టర్ బి వి సుబ్బారావు, సికిందర్,మోహన్, వాసుదేవ్, గర్రె రమేష్ బాబు, రామచంద్ర గుప్తా, బండ్లపల్లి రంగనాథం తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


