Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలి

విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలి

- Advertisement -

ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం; విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి దేశసేవ చేయాలని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించి వికసిత్ భారత్ 2047 సాధించుటలో భాగం కావాలని సేవా సంకల్ప్ అభియాన్ పోటీల నందు బి ఎస్ ఆర్ గర్ల్స్ హై స్కూల్ శరణ్య అనే విద్యార్థిని, తదుపరి మోడల్ కళాశాల బైపిసి ఫస్టియర్ విద్యార్థిని పి. వర్షిని విద్యార్థులు పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ లు ఆ విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జిల్లా స్థాయి డ్రాయింగ్ ,వక్తృత్వ పోటీలను ఐదు విభాగలుగా ఆల్ అమీన్ పాఠశాల-హిందూపురంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి 127 మంది విద్యార్థులు పాల్గొనగా 15 మంది విద్యార్థులు ఐదు విభాగాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు జిల్లా సైన్స్ అధికారి తనూజ్ కుమార్ అధికార పూర్వకంగా తెలపడం జరిగిందన్నారు. విజేతలు అక్టోబర్ నెల 9 వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు అని తెలిపారు.ముఖ్యంగా
ధర్మవరం మండలం నుండి బి ఎస్ ఆర్ గర్ల్స్ హై స్కూల్, ఏపీ మోడల్ కళాశాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన బి.ఎస్.ఆర్ గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందమునకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు