Friday, January 31, 2025
Homeజిల్లాలుఅనంతపురంఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం..మూత్రమయం. పట్టించుకోని అధికారులు

ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం..మూత్రమయం. పట్టించుకోని అధికారులు

కనీస మౌలిక వసతులు కల్పనలో విఫలమైన ఆర్టీసీ అధికారులు
ఆర్టీసీ బస్టాండ్లో అడుగుపెడితే ముక్కు దులాలు పగలాల్సిందే.

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: ఆర్టీసీ బస్టాండ్లో ఎటుచూసినా మూత్రమయమైనట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కిందట ఆర్టీసీ బస్టాండ్ నిర్మించినప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ మూడు జిల్లాల సరిహద్దు కావడంతో, రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరిగిపోతుంది. కానీ రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వెదజల్లుతోందన్నారు. ఆర్టీసీ అధికారులు ఆదాయమే ధ్యేయంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించినప్పటి నుండి డీజిల్ పెరిగింది, ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఎన్నోమార్లు బస్ ఛార్జీలు పెంచారు. అలాగే మరుగుదొడ్ల టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లతో సంవత్సరానికి ఒకసారి డబ్బులు దండుకుంటున్నారు. కానీ ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పనలో విఫలమయ్యారన్నారు. పరిసరాల పరిశుభ్రతలో తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోనే నెంబర్ వన్ గా పేరు ప్రతిష్టలు ఉన్న మున్సిపాలిటీ కావడం తాడిపత్రి ప్రజలకు గర్వించదగ్గ విషయం అన్నారు. అలాంటిది తాడిపత్రి మున్సిపాలిటీలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ తోలసి కోటలో గంజాయి మొక్కలా ఉందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఉన్న తాడిపత్రి పట్టణం ప్రాంతమంతా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశుభ్రతకు నిలయంగా ఉందని కొనియాడారు. కానీ ఆర్టీసీ బస్టాండ్ లో మాత్రం అపరిశుభ్రతకు నిలయముగా ఉండడం తాడిపత్రి ప్రయాణికుల దౌర్భాగ్యమని అన్నారు. ఏదేమనప్పటికీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సార్ ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించి ఆర్టీసీ బస్టాండ్ తాడిపత్రి మున్సిపాలిటీ లో ఉన్న విధంగా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు