Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జీవితములో తీపి గుర్తు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జీవితములో తీపి గుర్తు

- Advertisement -

రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జీవితంలో ఒక తీపు గుర్తుగా మిగిలిపోతుందని ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి 1996-97 సంవత్సరమునకు సంబంధించిన 120 విద్యార్థులు పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత విద్యార్థులను కలవడం అనేది నా జీవితంలో మరుపురాని రోజు అని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీరు చదువుకున్న చదువును సేవా కార్యక్రమాలు కూడా ఉపయోగించాలని, పేద విద్యార్థులను ఆదుకునేలా తమ వంతు సహాయ సహకారాలను అందించినప్పుడే మీరు చదువుకున్న వాటికి ఒక సార్థకత లభిస్తుందని తెలిపారు. ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో కష్టముతో, శ్రమతో ఒకే వేదిక మీదకు పూర్వ విద్యార్థులు రావడం అనేది ఆశ మాస పని కాదు అని, ఇందుకు కృషి చేసిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి నాతోపాటు అప్పట్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను కూడా ఆహ్వానించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం 18 మంది ఉపాధ్యాయులను, రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డిని ఘనంగా పూర్వ విద్యార్థులు సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆనాటి గురువులు మాకు బోధించిన చదువులోనే జీవితాన్ని తెలుసుకున్నామని, ఈ రకంగా గురువులను సన్మానించడం మాకెంతో సంతోషంగా ఉందని, జీవితములో మరుపురాని రోజు అని వారు తెలిపారు. తదుపరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వారు ఆనందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 120 మంది పూర్వ విద్యార్థులతో పాటు అప్పట్లో పనిచేసిన ఉపాధ్యాయులు సుధాకర్ ,వెంకటప్ప, రామకృష్ణ, నబి రసూల్, కొండారెడ్డి, పెద్దారెడ్డి, అశ్వత్థ నారాయణ రెడ్డి, వెంకటేశు, ఆంజనేయులు, కరుణ, సుబ్బా రత్నమ్మ షమీం, ప్రస్తుత హెడ్మాస్టర్ పద్మావతి, ప్రస్తుత ఉపాధ్యాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు