విశాలాంధ్ర-తాడిపత్రి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందినట్లు ఎస్సై రామాంజనేయులు రెడ్డి చెప్పారు. ఆయన మాట్లాడుతూ యల్లనూరు మండలంలోని తిమ్మoపల్లి గ్రామానికి చెందిన లేట్ పత్తికొండ పెద్దన్న కుమారుడు పత్తికొండ పెద్దన్న, వయసు (72) అను వ్యక్తి తనకు ఉన్న 1.50 ఎకరముల పోలంలో వరి పైరుకు నీళ్లు పెట్టుటకు తన భార్యతోపాటుగా బుధవారం ఉదయం 10.00 గంటలకు వెళ్లి కరెంట్ పోలులో ఉన్న లైనుకు, మోటార్ వైరుని తగిలించే క్రమములో ప్రమాదవశాత్తు ఆకస్మాత్తుగా తన కుడి చేయికి కరెంట్ షాక్ తగిలి క్రిందపడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానము కలదు. అందరికి పెళ్లిళ్లు అయినవి. భార్య చంద్రమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.


