Tuesday, April 29, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీ డీఎస్సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియలో మ‌రో కీల‌క అప్‌డేట్‌

ఏపీ డీఎస్సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియలో మ‌రో కీల‌క అప్‌డేట్‌

ప‌త్రాల‌ ధ్రువీక‌ర‌ణ స‌మ‌యంలో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించాలి
ఈ మేర‌కు మంత్రి నారా లోకేశ్ వెల్ల‌డి

ఏపీలో మెగా డీఎస్సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ తాజాగా కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. డీఎస్సీ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు పార్ట్‌2 కింద స‌ర్టిఫికెట్ల‌ను అప్‌లోడ్ చేయ‌డం ఇప్పుడు ఐచ్ఛికమని తెలిపారు. అయితే, ప‌త్రాల‌ ధ్రువీక‌ర‌ణ స‌మ‌యంలో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుందని వెల్ల‌డించారు. డీఎస్సీ అర్హ‌త కోసం గ్రాడ్యుయేష‌న్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్ర‌మాణాలు టెట్ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌న్నారు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ముఖ్య‌మైన విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా గుర్తుపెట్టుకోవాల‌ని మంత్రి సూచించారు. అలాగే అంకిత‌భావంతో చ‌దివి ఈ డీఎస్సీలో అభ్య‌ర్థులు విజ‌యం సాధించాల‌ని మంత్రి లోకేశ్ కోరారు.

కాగా, ఈ నెల 20న ఏపీ పాఠ‌శాల విద్యాశాఖ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేష‌న్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్ ఇలా..
ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు
మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్
జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షల నిర్వహణ‌
పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక ాకీ్ణ విడుదల
ఆ తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకర‌ణ‌
ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్ ాకీ్ణ విడుదల
అనంతరం వారం రోజులకు మెరిట్ జాబితా రిలీజ్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు